Union Minister Kishan Reddy watching man ki baath
Mann Ki Baath 100th Episode: సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ 100వ మన్ కీ బాత్ ఎపీసోడ్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ విశిష్టతను వివరించారు. సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు. సుమారు 100 కు పైగా దేశాల్లో కోట్లది మంది ఈ కార్యక్రమం చూశారని.. సామాజిక సేవ, సమాజంలో మార్పులు, ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారో ప్రధాని వివరిస్తున్నారని ఆయన అన్నారు.
Amazing artist : రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుడికి తెలియకుండా చిత్రాన్ని గీసిన ఆర్టిస్ట్.. ఆ తరువాత
‘‘సేవ చేస్తున్న వారి గురించి చెప్పి.. ప్రధాని మోదీ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి సైతం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మణిపూర్ లో ఓ అమ్మాయి గురించి ప్రధాని చెప్పడంతో ఆమె వ్యాపారం పెరిగింది. మరికొందరికి ఉద్యోగం సైతం ఇస్తోంది. దేశంలో లక్షలాది ప్రాంతాల్లో కోట్లాది మంది మన్ కీ బాత్ కార్యక్రమం చూశారు. సుమారు 100 దేశాల్లోని భారతీయులు సైతం చూశారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 100 చోట్ల, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 చోట్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది ఒక పార్టీకి సంబంధించిందో.. రాజకీయ పరమైన కార్యక్రమమో కాదు. సామాజిక సేవ, సమాజంలో మార్పులు, ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారో ప్రధాని వివరిస్తున్నారు’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Bandi Sanjay: నేను సచివాలయం కూలుస్తానని అనలేదు.. పునర్ నిర్మిస్తాం అంటున్నాం ..
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘చిన్న చిన్న ఉదాహరణలతో మోదీ వివరిస్తున్నారు. సమావేశంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎలా సేవ చేయొచ్చో ఇతరులకు మోదీ తెలియజేస్తున్నారు. మన్ కీ బాత్ లో ప్రస్తావన తర్వాత చాలా మంది మరింత పట్టుదలతో పని చేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. హిమాలయాల్లో కూడా ప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. వాటిని క్లీన్ చేస్తున్న వారి గురించి వివరించారు మోదీ. ఇలా ప్రతీ అంశాన్ని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ప్రతీ నెలలో చివరి ఆదివారం ఇలా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతున్నారు. ఇలా 100 ఎపిసోడ్ లలో వేలాది మంది జీవితాల గురించి ప్రజలకు మోదీ తెలియజేశారు. దేశంలోని ప్రతీ కుటుంబం మన్ కీ బాత్ ద్వారా దగ్గర అయ్యారు’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.