Bandi Sanjay : ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు- కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది.

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందోనని కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారాయన. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. కులగణనతో కాంగ్రెస్ కొరివితో తలగోక్కుంటోందని కామెంట్ చేశారు బండి సంజయ్.

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా? అని మండిపడ్డారు బండి సంజయ్. ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాదే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Also Read : హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లపై TGSRTC డిస్కౌంట్

”కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్. మేధావులారా.. బాకీల సర్కార్ ను బండకేసి బాదండి.. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఇకపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీనే. ఓట్లు అడిగే బీజేపీకే ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు వెళ్లింది బీజేపీ కార్యకర్తలే. ఏనాడైనా టీచర్లు, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడిందా?

Also Read : శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది. క్రైస్తవుల్లో చాలామంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా? మేధావులారా.. కాంగ్రెస్ ను ఓడించండి.. బీజేపీని గెలిపించండి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.