MLA Subhash Reddy: నేను ప్రజల్లోనే ఉంటా.. అందుకోసం దేనికైనా సిద్ధం..

గ్రేటర్‌ పరిధిలో నా ఒక్కడికే బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. నన్ను ఎందుకు తొలగించారో చెప్పాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రశ్నించారు.

MLA Subhash Reddy

 

BRS MLA Subhash Reddy: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకోసం 115 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం విధితమే. ఈ జాబితాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగాఉన్న భేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో సుభాష్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. మంగళవారం కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో తన నివాసంలో భేతి సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు. రాజకీయ భవితవ్యంపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నివాసానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.

Freebies: ఉచిత పథకాలు లేకపోతే ఎన్నికల్లో గెలవలేరా.. అసలెందుకీ పరిస్థితి?

ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం తరువాత ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధిష్టానం వైఖరిని తప్పుబట్టారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించిన నేను నిర్వహించాను. రాష్ట్రంలో ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో తన అనుచరులతో కలిసి పనిచేశాను. అవన్నీ గుర్తుచేసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఉద్యమ సమయంలో నేను పోలీసులను తప్పించుకుని ఆందోళనలు చేశా. ఎక్కడా భయ పడకుండా పనిచేశాం. రెండు సార్లు పోటీచేసే అవకాశం పార్టీ కల్పించిందని భేతి సుభాష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం టికెట్ దక్కిన వ్యక్తి ఏనాడైనా బీఆర్ఎస్ జెండా మోశారా? బండారి లక్ష్మారెడ్డి ఏ పార్టీలో ఉన్నారు అంటూ సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి ట్రస్ట్ పేరుతోనే ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఫ్లెక్సీలలో కాంగ్రెస్ నేతల ఫోటోలే ఉంటాయని సుభాష్ రెడ్డి విమర్శించారు.

Left Parties: కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తీపై సస్పెన్స్.. తెలంగాణలో ఆసక్తికరంగా పొత్తు రాజకీయం

గ్రేటర్‌ పరిధిలో నా ఒక్కడికే బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. నన్ను ఎందుకు తొలగించారో చెప్పాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. నేను ఎక్కడా అవినీతికి పాల్పడిన దాఖలాలులేవు. గ్రేటర్‌లో నేను మాత్రమే ఉద్యమ కారుడిని. ఉద్యమ కారులకు పార్టీలో స్థానం లేదా?  అని ప్రశ్నించారు. నాకు ఎందుకు టికెట్ కేటాయించలేదో తెలియదు. టికెట్ దక్కిన వ్యక్తి ప్రజల్లో ఉంటే నేను నియోజకవర్గంలో ఏం చేయాలని సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేనేం తప్పు చేశాను.? నేను ఎమ్మెల్యే‌‌గా గెలిచి ఆస్తులు అమ్ముకున్నా. పార్టీ‌తో నేను ఎలాంటి లబ్దిపొందలేదని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధిత్వాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి చూస్తాం. మరో వారం పదిరోజులు ఎదురు చూస్తాం. ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సుభాష్ రెడ్డి అన్నారు. నేను ప్రజాల్లోనే ఉంటా.. అందుకోసం దేనికైనా సిద్ధమని తెలిపారు.