Uttam Kumar Reddy: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆలమట్టి ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
“ప్రాజెక్టులపై కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆలమట్టి ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్ట్ స్టే ఉంది. ఎత్తు పెంపుకు మేం వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు పెంచకుండా అడ్డుకుంటాం. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తాం. (Uttam Kumar Reddy)
Also Read: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 100 శాంతం సుంకాలు.. మన సినిమాలపై తీవ్ర ప్రభావం
సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించాం. కృష్ణా, గోదావరి నీటి వాటాలో కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు న్యాయం జరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగింది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాగా, కర్ణాటక సర్కారు ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని నిన్న కేటీఆర్ అన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు.