గుర్రాల నుంచి కోవిడ్ వ్యాక్సిన్, ఆరు నెలల్లో రెడీ, HCU పరిశోధకుల ట్రయల్స్

  • Publish Date - May 19, 2020 / 09:22 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు. కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగ పడే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు HCU, CCMB, విన్స్ బయోప్రోడక్టు కంపెనీతో కలిసి పరిశోధనలు మొదలెట్టారు. 

కోవిడ్-19 వ్యాధికి తక్షణ చికిత్సకు సంబంధించి యాంటీ బాడీ వ్యవస్ధలతో కూడిన  ఇమ్యునో ధెరపీని అభివృధ్దిచేసే యోచనలో ఉన్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు. ఇక కరోనా వైరస్ ను ఉపయోగించి  గుర్రాలయాంటీ బాడీస్ ను అభివృధ్ధిచేశారు. వాటిని శుధ్ధి చేసి కరోనా చికిత్సకు అందిస్తారు. ఈవిధానంలో తక్కువ ఖర్చుతోనే యాంటీ బాడీస్ ను తయారు చేయవచ్చని పరిశోధకులు చెపుతున్నారు. 

గుర్రాలు, ఇతర జంతువుల నుంచి యాంటీ బాడీస్ ను సేకరించి  దాన్ని కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.  ఇన్ యాక్టివేట్ చేసిన కరోనా వైరస్ ని గుర్రాలకు ఇచ్చినప్పుడు  అవి యాంటీ బాడీలను ఉత్పత్తిచేస్తాయని  ఇవి కరోనా ట్రీట్ మెంట్ కు తోడ్పడతాయని భావిస్తున్నారు. 

ఇప్పటికే కొన్ని జంతువుల నుంచి సేకరించిన యాంటీ బాడీలను ప్రాణాంతాక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.  గుర్రాలనుంచి సేకరించిన యాంటీ బాడీస్ సమర్ధవంతంగా  పని చేయటంతో పాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు. మరో ఆరునెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకితెస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

Read: తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..ఎప్పటినుండి అంటే..