Vaikuntha Ekadashi : భద్రాద్రిలో తెరుచుకున్న శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు

భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరాడు. భారీగా భక్తులు పోటెత్తారు.

Vaikuntha Ekadashi : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరాడు. భారీగా భక్తులు పోటెత్తారు.

రాముడి దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. భద్రగిరి ఆధ్యాత్మిక శోభతో ఓలలాడింది. ఉత్తర ద్వారా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చరిత్రలో మొట్టమొదటిసారి యాదాద్రిలో ఉత్తర ద్వారా దర్శనం ద్వారా లక్ష్మీనరసింహస్వామిని భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.

Srivari Vaikuntha Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు

మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.

అర్చకులు ధనుర్మాస ప్రత్యేక పూజా, కైంకర్యాలు, నివేదనలు చేశారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్త జనం పోటెత్తారు. అర్చకులు శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు