రండి బాబూ రండి, నాకు కరోనా లేదు, నిర్భయంగా కొనండి.. ఓ వ్యాపారి వినూత్న ఐడియా

ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. ఎదురుగా ఎవరైనా కనిపిస్తే చాలు, భయంతో వణికిపోతున్నారు. కరోనా ఉందేమో అని అతడి వైపు అనుమానంగా, సందేహంగా చూస్తున్నారు. ఇక మార్కెట్ కు వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు కొనాలంటే మరింత భయపడుతున్నారు. మార్కెట్ లో ఏ వ్యాపారికి కరోనా ఉందో ఏమోనని వర్రీ అవుతున్నారు. ఇక వ్యాపారాలు తగ్గడంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ కూరగాయల వ్యాపారి భలే ఐడియా వేశాడు. అతడి ఆలోచన అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ అతడేం చేశాడో తెలుసా, కరోనా నెగిటివ్ అని వచ్చిన రిపోర్టును ఫ్రేమ్ గా కట్టాడు. తద్వారా తనకు కరోనా లేదని చెప్పి, వినియోగదారులకు భరోసా కల్పించాడు.
https://10tv.in/ipl-2020-kxips-chris-gayle-tests-negative-for-covid-19/
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు మార్కెట్‌కు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో పాత ఉట్నూరుకు చెందిన కూరగాయల వ్యాపారి శంకర్ స్థానిక పీహెచ్‌సీలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు. రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. తనకు కరోనా నెగిటివ్ రావడంతో, ఆ ధ్రువపత్రాన్ని తన కూరగాయల దుకాణంలో అందరికీ కనిపించేలా ఫ్రేమ్ కట్టి పెట్టాడు. ‘నాకు కరోనా లేదు.. నిర్భయంగా కూరగాయలు కొనవచ్చు’ అని వినియోగదారులకు భరోసా కల్పించాడు.
వ్యాపారి ఐడియా అందరిని అట్రాక్ట్ చేసింది. సరికొత్తగా, భిన్నంగా ఆలోచన చేసిన శంకర్ ను అంతా మెచ్చుకుంటున్నారు. నీ ఐడియా అదుర్స్ అని కితాబిస్తున్నారు.