VHP : ఎల్బీ స్టేడియంలో లక్ష యువ గళ గీతార్చన
భారీ సంఖ్యలో హాజరైన స్వామీజీలు, యువతీ యువకులతో.. ఎల్బీ స్టేడియం అంతా కాషాయమయమై కనిపించింది.

Lb Stadium Laksha Yuva Gala Geetharchana
VHP : హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి భారీస్థాయిలో స్పందన కనిపించింది. గీతా జయంతి సందర్భంగా లక్ష మంది యువతీ,యువకులతో లక్ష యువగళ గీతార్చన నిర్వహించింది వీహెచ్‌పీ. భగవద్గీతలోని 40 శ్లోకాలను సామూహికంగా యువతీ, యువకులు పారాయణం చేయడం ఆకట్టుకుంది.
Read Also : Gita Jayanthi : భగవద్గీత పారాయణతో పులకరించిన సప్తగిరులు
లక్ష యువగళ గీతార్చనకు ముఖ్య అతిథులుగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొషాధికారి శ్రీ శ్రీ శ్రీ గోవింద్ గిరి జి మహారాజ్, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, శ్రీ శ్రీ శ్రీ ఉడుపీ పీఠం పెజావర్ స్వామి, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే జీ, మైహోం గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు, గోవింద గిరి జీ, పలువురు స్వామీజీలు హాజరయ్యారు.
Read Also : AP Cinema Tickets Rates : ఏపీలో సినిమా టికెట్ రేట్లపై హైకోర్టు కీలక తీర్పు.. జీవో రద్దు!
భారీ సంఖ్యలో హాజరైన స్వామీజీలు, యువతీ యువకులతో.. ఎల్బీ స్టేడియం అంతా కాషాయమయమై కనిపించింది.