Viral Video : వేలల్లో సమోసాలు తయారు చేస్తున్న దుకాణం.. పరిశుభ్రతపై మాత్రం పెదవి విరుస్తున్న జనం.. ఎక్కడంటే?

హైదరాబాద్‌లో ఓ దుకాణంలో సమోసాలు తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

Hyderabad

Hyderabad : హైదరాబాద్‌లోని ఓ షాప్‌లో రోజుకి 10,000 వేల సమోసాలను తయారు చేస్తారట. వాళ్లు అన్ని సమోసాలు ఎలా తయారు చేస్తారో వాటి మేకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Renu Desai : హైదరాబాద్, పూణేలో రేణుదేశాయ్‌కి ఆస్తులు.. ఆమెకు సంపాదన ఎలా వస్తుంది..?

సాయంత్రం అయ్యేసరికి టీతో పాటు వేడి వేడి సమోసాలు తినడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి?  హైదరాబాద్‌లో నోరూరించే సమోసాలను వేల సంఖ్యలో తయారు చేస్తున్న ఓ వ్యాపారి షాప్‌కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో సమోస తయారు చేయడానికి ముందు పిండిని కలపడం.. వాటిని రోటీలుగా చేయడం దగ్గర్నుంచి గోల్డెన్ కలర్‌లో సమోసాలను వేయించడం వరకు చూపించారు. hmm_nikhil అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అయితే చాలామంది నెటిజన్లు ఈ వీడియో చూసి పెదవి విరిచారు.

Viral Video: హైదరాబాద్ రోడ్లపై ప్రేమ జంట.. హద్దూ పద్దు లేకుండా ఇలా.. వీడియో చూస్తారా?

‘వావ్.. నాకెంతో ఇష్టమైన సమోసా’.. ‘జబర్దస్త్ సమోసా’ అని కొందరు కామెంట్లు పెడితే దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని కొందరు చిరాకు పడ్డారు. సమోసాలు తయారు చేస్తున్న వ్యక్తులు సరైన దుస్తులు ధరించలేదని.. వారి చెమట కూడా ఆహారంలో కలుస్తుందని మండిపడ్డారు. ఇలాంటి వీడియోలు చూసినపుడు ఆందోళన కలగడం సహజమే మరి. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.