Viral Video: హైదరాబాద్ రోడ్లపై ప్రేమ జంట.. హద్దూ పద్దు లేకుండా ఇలా.. వీడియో చూస్తారా?

ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇటువంటి వారంతా.. అంటూ తీవ్ర విమర్శలు. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ..

Viral Video: హైదరాబాద్ రోడ్లపై ప్రేమ జంట.. హద్దూ పద్దు లేకుండా ఇలా.. వీడియో చూస్తారా?

Sunroof

Hyderabad: హైదరాబాద్ రోడ్లపై ఓ ప్రేమ జంట హద్దూ పద్దు లేకుండా తిరిగింది. కారు సన్‌రూఫ్‌పై అందరికీ కనపడేలా కూర్చొని రెచ్చిపోయింది. మిగతా ప్రపంచంతో తమకేం సంబంధం లేదన్నట్లు.. అందరినీ మర్చిపోయి తమదైన లోకంలో విహరించింది ఈ ప్రేమ జంట.

నగరంలోని పీవీ నర్సింహ రావ్ ఎక్స్‌ప్రెస్ వేలో ఈ యువతి, యువకుడు ఇలా సన్నిహితంగా కనపడ్డారు. కారు వేగంగా వెళ్తుండగా, ఈ ప్రేమ జంట కోరికలు అంతకన్నా వేగంగా ప్రయాణించాయి. ఇక వారికి ఈ ప్రపంచం ఏం గుర్తుంటుంది? ప్రేమలో మునిగిపోయాక ఈ లోకంలో మనమిద్దరమే ఉన్నామని అనుకున్నారేమో… సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఎలాంటి పోజులు ఇస్తారో అటువంటి పోజులు ఇస్తూ ఈ అమ్మాయి, అబ్బాయి కనపడ్డారు.

వీడియో చివరలో.. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నట్లు తన ప్రేయసికి ఏదో చూపిస్తూ ఆ ప్రియుడు మరో పోజు ఇచ్చాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో అమ్మాయి, అబ్బాయి బైకులపై వెళ్తూ ఇలాంటి అసభ్య చర్యలకు పాల్పడ్డ ఘటనలు ఇటీవల పదే పదే వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పుడు కారుపై కూడా ఇటువంటి దృశ్యాలు సాక్షాత్కారమిస్తున్నాయి. ఈ ప్రేమ జంటపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులను ట్యాగ్ చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు.

Nupur Sanon : నీలి రంగు లెహంగాలో నిలువెత్తు మెరిసిపోతున్న నుపుర్ సనన్..