Sunny Leone : 14 కోట్లతో తెలుగులో సన్నీ లియోన్ సినిమా.. డిసెంబర్ లో రిలీజ్..
తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. (Sunny Leone)

Sunny Leone
Sunny Leone : అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో రజేశ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. సన్నీలియోన్ మెయిన్ లీడ్ లో యోగేష్ కల్లే, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, ఆషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Sunny Leone)
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. త్రిముఖ సినిమాని హిందీ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కిస్తుండగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also See : Manchu Lakshmi : మంచులో సాహసాలు చేస్తున్న మంచు లక్ష్మి.. ఐస్ ల్యాండ్ వెకేషన్..
తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదేదో థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది.