Chittoor Police: వీధుల్లో తిప్పుతూ.. బాలిక గ్యాంగ్ రేప్ నిందితులకు.. చిత్తూరు పోలీసుల మార్క్ ట్రీట్ మెంట్

చిత్తూరులోని నగరవనం పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.

Chittoor Police: వీధుల్లో తిప్పుతూ.. బాలిక గ్యాంగ్ రేప్ నిందితులకు.. చిత్తూరు పోలీసుల మార్క్ ట్రీట్ మెంట్

Updated On : October 3, 2025 / 7:17 PM IST

Chittoor Police: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ నిందితులకు చిత్తూరు పోలీసులు తమ మార్క్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. నిందితులను వీధుల్లో నడిపించుకుంటూ వెళ్లారు. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నగర వీధుల గుండా నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. 4 రోజుల క్రితం చిత్తూరులోని పార్క్ లో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. స్నేహితుడితో కలిసి పార్క్ కు వచ్చిన మైనర్ బాలికను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులు మహేశ్, కిషోర్, హేమంత్ లను ఇవాళ అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు.

గత నెల 25వ తేదీన చిత్తూరులోని నగరవనం పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలితో వచ్చిన యువకుడు 29వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. యువకుడిని నిర్బంధించి ముగ్గురు యువకులు మైనర్ బాలికపై వరుసగా రేప్ కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

నిందితులు చాలా క్రూరులు అని పోలీసులు తెలిపారు. పార్కుకు వచ్చే ప్రేమ జంటలను ఈ నీచులు టార్గెట్ చేస్తున్నారు. వారి వీడియోలు తీస్తారు. తర్వాత వారిని బెదిరించి డబ్బు, నగలు దోచుకుంటారు. అంతేకాదు లైంగికంగా వేధిస్తారు. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Also Read: భార్యతో గొడవ పెట్టుకున్న వ్యక్తిని రోడ్డుపై ఉరికించి కొట్టి, ఇలా క్రూరంగా చంపేసి..