రాహుల్ గాంధీ కూడా రక్షించలేరు.. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడిస్తా: ప్రశాంత్ కిశోర్ ప్రతిజ్ఞ
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన సాయాన్ని కోరారని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

Prashant Kishor: తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూ బిహార్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని రక్షించలేరని పీకే అన్నారు.
బిహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గతంలో అవమానించారని ప్రకాశ్ కిశోర్ అన్నారు. “బిహారీల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే చెత్త అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలా అయితే మా వద్దకు సాయం అడగడానికి ఆయన ఎందుకు వచ్చారు?” అని ప్రశాంత్ కిశోర్ టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో అన్నారు.
Also Read: కలకలం రేపుతున్న టమాటా వైరస్.. ఈ లక్షణాలు కనపడితే పిల్లలను స్కూలుకు పంపొద్దంటూ సూచనలు
“రాహుల్ గాంధీ కూడా ఆయనను రక్షించలేరు. ఎవ్వరూ రక్షించలేరు. మేము ఆయనను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం, పూర్తిగా ఓడిస్తాం” అని చెప్పారు. (Prashant Kishor)
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన సాయాన్ని కోరారని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
“రేవంత్ రెడ్డి పలుసార్లు ఢిల్లీలో మమ్మల్ని కలిశారు. తెలంగాణకు సంబంధించిన విషయంలో సాయం అడిగారు. నేను సాయం చేయలేదు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక, బిహారీలను అవమానించేంత అహంకారిగా మారారు. నేను బిహార్‌కి చెందిన వ్యక్తిని. మా డీఎన్ఏ తక్కువైతే, మా సాయం ఎందుకు కోరారు? మేము తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని ఓడిస్తాం” అని వ్యాఖ్యానించారు.