Amazon Flipkart Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఐఫోన్ కొనే ముందు మీకు ‘ఔట్ ఆఫ్ స్టాక్’ అని కనిపిస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి..!

Amazon, Flipkart Sale : ఆపిల్ ఐఫోన్లు, ఇతర ప్రొడక్టులపై ‘ఔట్ ఆఫ్ స్టాక్’ ఉంటే ఏం చేయాలి? ఏదైనా కొనే ముందు ఈ 5 ట్రిక్స్ ఓసారి ట్రై చేయండి..

Amazon Flipkart Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఐఫోన్ కొనే ముందు మీకు ‘ఔట్ ఆఫ్ స్టాక్’ అని కనిపిస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి..!

Amazon, Flipkart Sale

Updated On : October 3, 2025 / 7:19 PM IST

Amazon Flipkart Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ లేదా ఏదైనా ప్రొడక్టు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లలో పండుగ సేల్స్ సందడి కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలతో సహా అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ సేల్స్ రిటైలర్లలో బాగా పాపులర్ పొందాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఫ్లిప్‌కార్ట్ త్వరలో నెక్స్ట్ ఫెస్టివల్ ధమాకా సేల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

ఈ సేల్స్ సమయంలో చాలా మంది (Amazon Flipkart Sale) తమకు ఇష్టమైన ఫోన్లు, ఇతర ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ, తగ్గింపు ధర అనేది లిమిటెడ్ ఇన్వెంటరీకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాంతో ప్రొడక్టులు దాదాపు వెంటనే స్టాక్ అయిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. అయితే, మీకు కావలసిన డివైజ్ మీకు అందుబాటులో ఉండేందుకు సాయపడే కొన్ని సాధారణ ట్రిక్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్లు, ఇతర ప్రొడక్టులపై ‘ఔట్ ఆఫ్ స్టాక్’ నివారించే 5 ట్రిక్స్ మీకోసం :
ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ :
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకమైన సభ్యత్వాలను (అమెజాన్ ప్రైమ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వంటివి) అందిస్తాయి. కొనుగోలుదారులకు అమ్మకాలకు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తాయి. తగ్గింపు ధరలు లిమిటెడ్ స్టాక్‌తో ఉంటాయి. ఆయా డివైజ్‌లు అమ్ముడుపోకముందే ముందస్తు యాక్సెస్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

స్టాక్‌ను చెక్ చేస్తూ ఉండండి :
కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్‌లు ప్రొడక్టులను తాత్కాలికంగా “స్టాక్‌లో లేవు” అనే మార్క్ ఉంచుతాయి. వేర్ హౌస్‌లో ఇన్వెంటరీని తిరిగి నింపిన తర్వాత స్టాక్ తరచుగా మళ్లీ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల, మీకు ఇష్టమైన డివైజ్ తిరిగి ఆన్‌లైన్‌లోకి వస్తుందో లేదో చూసేందుకు ప్రొడక్టు పేజీని చెక్ చేస్తూ ఉండండి.

Read Also : Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్.. ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50s ప్లస్ 5G ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

విష్ లిస్ట్ వాడండి :
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా ప్రీమియం ప్రొడక్టులకు తాత్కాలిక సేల్ ధరను అసలు సేల్ ప్రారంభానికి ముందే ప్రకటిస్తాయి. సేల్ ప్రారంభమైన తర్వాత ఆర్డర్ చెక్అవుట్ ప్రాసెస్ వేగంగా ఉండేందుకు మీరు ఆయా డివైజ్ ముందుగానే మీ విష్ లిస్ట్‌కు యాడ్ చేసుకోండి.

నోటిఫికేషన్‌లను సెట్ చేయండి :
చాలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ప్రొడక్టు స్టాక్‌ రెడీగా ఉన్నప్పుడు నోటిఫై చేసేందుకు యూజర్లకు అవకాశాన్ని అందిస్తున్నాయి. సకాలంలో నోటిఫికేషన్ పొందాలంటే ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉండండి.

వేర్వేరు లొకేషన్లలో ట్రై చేయండి :
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్ల నుంచి ఆర్డర్‌లను అందిస్తున్నాయి. మీ ప్రస్తుత అడ్రస్ నుంచి ఒక ప్రొడక్టు స్టాక్‌లో లేదని చూపిస్తే.. మీరు వేరే సర్వీసు అందించే లొకేషన్ లేదా జిప్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ప్రొడక్టు లభ్యతను చెక్ చేయొచ్చు.