Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్.. ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50s ప్లస్ 5G ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా ఇన్ఫినిక్స్ నోట్ 50s ప్లస్ చౌకైన ధరకే లభిస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో రూ. 5వేలు తగ్గింపు..

Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్.. ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50s ప్లస్ 5G ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Amazon Diwali Sale

Updated On : October 3, 2025 / 5:48 PM IST

Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh లాంగ్-బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. మీరు 4K రిజల్యూషన్ వరకు రికార్డ్ చేసే 64MP ప్రైమరీ సెన్సార్, భారీ 6.78-అంగుళాల ఫుల్ HD ప్లస్ 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. అదేవిధంగా, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగిన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ SoC ప్రాసెసర్‌ కూడా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Diwali Sale) సేల్‌లో కూడా రూ. 5వేల తగ్గింపుకే లభిస్తోంది. అమెజాన్ దీపావళి సేల్‌లో ఈ ఇన్ఫినిక్స్ 5G ప్లస్ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ నోట్ ఫోన్ డిస్కౌంట్ ధరకే :

అమెజాన్ దీపావళి సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5G+ ఫోన్‌పై 25శాతం తగ్గింపు అందిస్తోంది. అసలు ధర రూ. 19,999 నుంచి తగ్గింపు తర్వాత మీరు రూ. 5వేలు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. కేవలం 14,999 మాత్రమే చెల్లించాలి. మీకు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే.. మీరు బ్యాంక్ ఆఫర్‌గా రూ. 1,250 తగ్గింపు పొందవచ్చు. మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 449 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Flipkart Festive Dhamaka 2025 Sale : పండగ చేస్కోండి.. ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త ఫెస్టివల్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్లు..!

పర్ఫార్మెన్స్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్టిమేట్ SoC ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వంటి టాస్కులపై అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో 6GB లేదా 8GB ర్యామ్ వేరియంట్‌ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 16GB వరకు వర్చువల్ ర్యామ్ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్‌ ఎక్స్ ఎరేనాతో గేమింగ్ కోసం కూడా ఆప్టిమైజ్ అయింది. 90 FPS గేమింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3D కర్వ్డ్ ఎమరాల్డ్ స్క్రీన్‌ కలిగి ఉంది. మీరు 1300 నిట్స్ హై పీక్ బ్రైట్‌నెస్‌ పొందవచ్చు. క్వాడ్ రీన్‌ఫోర్స్డ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ద్వారా అందిస్తుంది. మీరు ప్రత్యేకమైన GM కట్ కెమెరా మాడ్యూల్‌ పొందవచ్చు. నోటిఫికేషన్లు, కాల్స్, ఛార్జింగ్ కోసం యాక్టివ్ హాలో లైటింగ్ స్ట్రిప్‌ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఎంఐఎల్-ఎస్టీడీ 810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫైడ్ కూడా కలిగి ఉంది.

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 64MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ ఫోన్‌లో 5500mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. లిమిట్ యూసేజ్‌తో రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయవచ్చు.