Flipkart Big Festive Dhamaka Sale : అక్టోబర్ 4 నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్.. శాంసంగ్ గెలాక్సీ S24, ఐఫోన్ 16, పిక్సెల్ 9లపై భారీ డిస్కౌంట్లు..!
Flipkart Big Festive Dhamaka Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ మొదలు కాబోతుంది. ఈ నెల 4 నుంచే సేల్ మొదలు కానుంది. పూర్తి వివరాలివే

Flipkart Big Festive Dhamaka Sale
Flipkart Big Festive Dhamaka Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తర్వాత బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8, 2025 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ సేల్ కూడా హై-ఎండ్ ఫోన్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
ఇప్పుడు ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ (Flipkart Big Festive Dhamaka Sale) కొత్త పండుగ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24, ఆపిల్ ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ 2025 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ S24 :
భారత మార్కెట్లో రూ.74,999కు లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.38,999కు లభిస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల డైనమిక్ ఎల్‌టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ అడ్రినో 750 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4000mAh బ్యాటరీతో పాటు 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 16 :
128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 8GB ర్యామ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో రూ.56,999కు లభిస్తుంది. ఈ ఐఫోన్ అసలు లాంచ్ ధర రూ.69,999 నుంచి భారీగా తగ్గింది. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఆపిల్ A18 ప్రాసెసర్‌ను అందిస్తుంది. 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్ ఈ సేల్‌లో అసలు ధర రూ.79,999 నుంచి రూ.52,999కి కొనుగోలు చేయవచ్చు. Mali-G715 ప్రాసెసర్‌తో గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీతో పాటు 27W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.