Vikarabad Accident: వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
వికారాబాద్(Vikarabad Accident) జిల్లా గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చిన ఒక కారు వెనుక నుంచి తీవ్రంగా ఢీకొట్టింది.
- V Santhosh Kumar
- Published on- August 30, 2026 / 10:47 PM IST
Vikarabad road accident car collided parked truck two dead
- వికారాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- అక్కడికక్కడే ఇద్దరు వృద్ధుల మృతి
- క్షతగాత్రులకు ఆస్పత్రిలో అత్యవసర వైద్యం
Vikarabad Accident: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చిన ఒక కారు వెనుక నుంచి తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఇద్దరి మృతి, మరొక ఇద్దరికి తీవ్ర గాయాలు:
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. దోమ మండలం(Vikarabad Accident) కిష్టాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హై అనే వ్యక్తి తన కారులో ముగ్గురికి లిఫ్ట్ ఇచ్చి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
