Vinayaka Chavithi : సెప్టెంబర్ 19న వినాయక చవితి.. 28న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

దేశంలో హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక్ పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు.

Vinayaka Chavithi

Vinayaka Chavithi And Immersion : సెప్టెంబర్ 19న వినాయక చవితి, 28న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఉంటుందని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం, అధికారులు చెప్పారని వెల్లడించారు. గణేష్ పూజా విధానం తెలిపే బుక్ తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలని పేర్కొన్నారు. వినాయక మండపాలకు పోలీస్ పర్మీషన్ తప్పనిసరి కాదని, స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పితే సరిపోతుందని తెలిపారు.

రాజకీయ నాయకులు గణేష్ ఉత్సవాల్లో ఫ్లెక్సీలో పెడుతున్నారని, సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించిందన్నారు. ఈ సారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టొద్దని మంత్రికి చెప్పామని తెలిపారు. సెప్లెంబర్ 19న వినాయక చవితిగా నిర్ణయించామని పేర్కొన్నారు. సూర్యోదయం ఆధారంగా వినాయక చవితిని 19న నిర్ణయించామని, 28న వినాయక నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. వినాయక చవితి పండుగ ఏ తేదీ అని చాలా మందిలో సందేహం ఉందన్నారు.

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సెప్టెంబర్ 19వ తేదీనే సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగ, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందని తెలిపారు. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండగ రోజుగా గుర్తిస్తాం.. కాబట్టి 19వ తేదీన వినాయక చవితి జరుపుతున్నామని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలకు ముఖ్యమంత్రిని రావాలని చెప్పామని తెలిపారు.

గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం ముగిసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. దేశంలో హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక్ పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు.

Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీదేవిని పూజించండి.. కరుణా కటాక్షాలు పొందండి.. పూజా విధానం, నియమాలు మీకోసం

రాష్ట్ర ప్రభుత్వం తరపున గడిచిన 9 ఏళ్ల పాటు అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం శోభాయామానంగా జరుగుతుందన్నారు. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఓకే రోజు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. బడ్జెట్ తో సంబందం లేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించిందన్నారు. మండపాల పర్మిషన్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని వెల్లడించారు. సోమవారం MCRHRDలో గణేష్ ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, పలు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది.

Swami Prasad Maurya: హిందూ మతమనేదే లేదు, బ్రాహ్మణిజాన్ని అలా పిలుస్తున్నారు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

ఈ సమావేశం కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సహా పలువురు పాల్గొన్నారు. బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ వైఎంసీఏ గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులకు హాజరయ్యారు. నగరంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించే అంశంపై చర్చించారు. గనేష్ ఉత్సవ కమిటీల అభిప్రాయాలతో పాటు సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు