Vivek Sharma: కన్నవారి కోసం.. ఏకంగా రూ.2.9 కోట్ల అమెరికా ఉద్యోగం వదులుకున్నాడు.. స్వగ్రామంలో కిరాణా కొట్టు..

కోట్ల రూపాయల ప్యాకేజీ కంటే కన్నవారే మిన్న అని నిరూపించిన ఐఐటీయన్ వివేక్ శర్మ(Vivek Sharma) గాథ నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Vivek Sharma from Uttar Pradesh gave up a 20 million job in the US for the sake of his parents

  • కోట్ల అమెరికా ఉద్యోగం తిరస్కరణ
  • కన్నవారి సేవకే ప్రథమ ప్రాధాన్యం
  • పేద పిల్లలకు ఉచిత కోడింగ్

Vivek Sharma: కోట్ల రూపాయల ప్యాకేజీ కంటే కన్నవారే మిన్న అని నిరూపించిన ఐఐటీయన్ వివేక్ శర్మ గాథ నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నేటితరం యువత కెరీర్, డబ్బు వెనుక పరుగులు తీస్తున్న తరుణంలో, ఈ యువకుడు తీసుకున్న అసాధారణ నిర్ణయం మానవత్వ విలువలను, తల్లిదండ్రులపై ఉన్న బాధ్యతను చాటిచెబుతోంది.

Narendra Modi: ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం.. పర్యటనకు ముందే మోదీకి బెదింపులు.. ఇరు దేశాల రక్షణ వర్గాల హై అలర్ట్

ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌కు చెందిన వివేక్ శర్మ(Vivek Sharma) ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడలిస్ట్. అతని అద్భుతమైన ప్రతిభకు ముగ్ధుడైన శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ, ఏకంగా రూ. 2.90 కోట్ల వార్షిక ప్యాకేజీతో అమెరికా రమ్మని ఆఫర్ ఇచ్చింది. వీసా స్పాన్సర్‌షిప్‌తో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అతని జీవితంలో తీవ్రమైన కుటుంబ సంక్షోభం నెలకుంది.

సరిగ్గా అదే సమయంలో అతని తండ్రికి గుండెపోటు రావడం, తల్లి క్యాన్సర్ బారిన పడటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వివేక్ కోట్ల రూపాయల ఉద్యోగం కంటే కన్నవారికి సేవ చేయడమే పరమావధిగా భావించి, ఆ అమెరికా ఆఫర్‌ను వదులుకున్నాడు. ప్రస్తుతం కాన్పూర్‌లోనే ఉంటూ ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ, తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నాడు. అంతేకాకుండా, స్థానిక పేద పిల్లలకు ఉచితంగా కోడింగ్ నేర్పిస్తూ తన విజ్ఞానాన్ని పంచుతున్న ఈ యువకుడి గొప్ప మనసును లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.