Telangana Ec
Voter List Amendment Schedule : ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 09వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది. 2021 నవంబర్ 01వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణను చేపట్టి…నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు ఈసీ అవకాశం కల్పించింది. జనవరి 05వ తేదీన ఓట్లర్ల తుది జాబితాను ప్రచురించనుంది. 2022 జనవరి 01వ తేదీ నాటికి 18 ఏళ్లు వచ్చే వారికి ఓటు హక్కుకు అర్హులని వెల్లడించింది.
Read More : Temple In Pakistan : పాకిస్తాన్లో మరో ఆలయంపై దాడి..విగ్రహాల ధ్వంసం
⇒ 2021, ఆగస్టు 09వ తేదీ నుంచి 31వరకు ముందస్తు కార్యక్రమాలు, ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ.
⇒ 2021, నవంబర్ 01వ తేదీన ఓట్లర జాబితా ముసాయిదవా ప్రచురణ.
⇒ 2021, నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం.
⇒ 2021, డిసెంబర్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతుల పరిష్కారం.
Read More : Airtel : ఎయిర్‌టెల్ ఆఫీసు ఇంటర్నెట్ ప్లాన్
⇒ 2022, జనవరి 01వ తేదీ అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ.
⇒ 2022, జనవరి 05వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురణ.
⇒ 2022, జనవరి 01వ తేదీ నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటు హక్కుకు అర్హులు.
⇒ www.nsvp.in ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం.