Telangana Assembly Election 2023 : తెలంగాణ ఎన్నికల్లో వింత డిమాండ్లతో నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!

ఐదేళ్లు మీవి..ఈరోజు మాది అన్నట్లుగా ఓటర్లు రాజకీయ నేతలకు వింత వింత డిమాండ్లు పెడుతున్నారు. దీంతో సదరు నేతలకు దిమ్మ తిరిగిపోతోంది. ఓటర్లు డిమాండ్లు విన్న నేతలకు దిక్కుతోచటంలేదు. మరి అవి ఎలాంటి డిమాండ్లో తెలుసుకోండి..

Telangana Assembly Election 2023 : తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమ పార్టీకి ఓట్లు వేయాలని.. తమకు ఓట్లు వేసి గెలింపిచాలని కోరిన రాజకీయ నేతల్ని చూశాం. ఆసారైనా తమకు ఓటు వేసి గెలిపించాలని..లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయ నేతల్ని కూడా చూశాం. కానీ ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. పోలింగ్ మొదలైంది. ఈక్రమంలో మేం ఓట్లు వేశాక..మీరు గెలిచాక ఐదేళ్లు మీవి..కానీ ఈఒక్క రోజు మాది అంటూ రాజకీయ నేతలకు ఓటర్లు వింత వింత డిమండ్స్ తో చుక్కలు చూపిస్తున్నారు.

ఈ వింత వింత ఘటనలు వింటే నేతలకు చుక్కలు.. వినేవాళ్లకు నవ్వులు రాకతప్పదు.  ఇప్పటి వరకు ఓట్లు అడగటం రాజకీయ నేతల వంతు అయితే..ఇక టైమ్ మాది అంటూ ఓటర్లు వింత వింత డిమండ్లతో ఆసక్తికలిగిస్తున్నారు. సాధారణంగా ఓట్లు కావాలని అడిగిన నేతలు గెలిచాక కనిపించకుండాపోతారు. తాము ఓట్లు అడిగిన ఓటర్లే తమ వద్దకు వచ్చినా పట్టించుకోరు. అటువంటి నేతల విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు కాస్త హుషారుగా ఉంటు.. వింత ఘటనలతో నేతలకు చుక్కలు చూపిస్తుంటారు.

కొంతమంది పోలింగ్ ను బహిష్కరించి తమ నిరసనను తెలియజేస్తుంటారు. మరికొంతమంది తాము ఓటు వేయాలంటే డబ్బులు ఇవ్వాలని డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం లేదంటే వేసేది లేదు అంటూ తేల్చి చెప్పేస్తుంటారు. ఇంకొంతమంది తమకు వద్దకు ఓట్లు అడగటానికి వచ్చిన నేతల్ని తమ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం.. బహిరంగంగానే నిలదీస్తుంటారు. దీంతో నేతలు పట్టుబడిపోయి ఏం చెప్పాలో తెలియక ఏదోక సమాధానం చెప్పి తప్పించుకునిపోతుంటారు.

బీఆర్ఎస్ అభ్యర్థికి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన అవ్వ..
దాదాపు అటువంటి వింత అనుభవమే ఎదురైంది నిర్మల్ జిల్లా బాసరలో బిఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డికి. ‘‘నీ ఓటు ఎవరికి ఓటు వేశావ్ అవ్వా’’ అంటూ ఓ వృద్ధురాలిని ఎంతో ఆసక్తిగా అడిగారు విఠల్ రెడ్డి. దానికి ఆ అవ్వ సదరు రెడ్డిగారికి దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పింది.‘‘నాఇష్టం ఎవరికైనా వేస్తా’’ అంటూ నువ్వు అడిగితే నేను సమాధానం చెప్పాలా..? అన్నట్లుగా మొహంమీదే చెప్పేసి వెళ్లిపోయింది ఆమె.ఇక పాపం ఆయన మొహం ఎలా ఉండి ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.

మాకు సమాధనం లేదు.. మీకెందుకేయాలే ఓట్లు..
అలాగే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజుల పాలెం గ్రామంలో గ్రామస్తులు ఓట్లు బహిష్కరించారు.రాజుల పాలెం గ్రామం నుండి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు గతంలో డిమాండ్ చేశారు. కానీ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు కాబోలు దీంతో తమకు సమాధానం చెప్పనివారికి తాము ఎందుకు ఓట్లు వేయాలి..? అని అనుకున్నారో ఏమోగానీ మొత్తం గ్రామం అంతా ఓట్లను బహిష్కరించారు.

డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం..
ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలం వీరాపురం గ్రామంలో గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. తాము ఓటు వేయాలంటే తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో ఓటుకు డబ్బులు ఇవ్వడంలేదని గ్రామస్తులంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఓటర్ స్లిప్పులు పట్టుకొని పెద్ద ఎత్తిన గుమ్ము గుడివ వద్ద మహిళలు, గ్రామస్తులు గుమిగూడారు.డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటూ లేకపోతే వెయ్యమని ఖరాకండిగా తేల్చి చెప్పారు మహిళా మణులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం రాజుపేట కాలనీలో బూత్ నెంబర్ 144, 141 బూతుల్లో 400 మంది ఓటర్లు ఓటు వేయమని నిరసన వ్యక్తంచేశారు. మాకు ఏ పార్టీ నాయకుడు డబ్బులు ఇవ్వలేదని డబ్బులు ఇవ్వకపోతే ఓటు ఎందుకు వేయాలి..? అని ప్రశ్నిస్తున్నారు. డబ్బులిస్తేనే ఓటు వేస్తాం లేదంటే వేయం అని భీష్మించుకుని కూర్చున్నారు. అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇంటి ఎదుట హమాలీ కాలనీ కి చెందిన ఓటర్ల ఆందోళన చేపట్టారు. తమకు డబ్బులు ఇవ్వకపోవటంత వనమాని ఓటర్లు నిలదీశారు. దీంతో పోలీసులు వారందరిని చెదరగొట్టారు.

సమస్యలు అలాగే ఉన్నాయ్.. ఓట్లేసి లేదు..
ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివాసి గిరిజనులు నిరసన వ్యక్తంచేశారు. తమకు రహదారులు, త్రాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని ఆదివాసి గిరిజనులు నిరసన వ్యక్తంచేశారు. తమ సమస్య పరిష్కరించేంతవరకు ఓటు వేయమని అడవిబిడ్డలు తెగేసి చెప్పారు. ఇలా ..ఈసారి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు వింత వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓట్ల కోసం నేతలు అభ్యర్థిస్తుంటే..సమస్య పరిష్కారం కోసం..తాము ఓటు వేయాలంటే డైరెక్ట్ గా నేతల్నే డబ్బులు అడిగేస్తు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు