Ragging in Warangal Kakatiya University : కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ పై వీసీ తాటికొండ రమేశ్ స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్దారణ అయ్యిందని అందుకే 81 మంది విద్యార్థినిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని స్పష్టంచేశారు. సీనియర్ విద్యార్ధినిలు జూనియర్లతో డ్యాన్స్ లు చేయించారని..పాటలు పాడించటమే కాకుండా వారితో గుంజీలు తీయించారని ఈ విషయంపై విచారణ జరిపామమని విచారణలు ర్యాగింగ్ జరిగినట్లుగా నిర్ధారణ అయ్యిందని అందుకే సస్పెండ్ చేశామని వెల్లడించారు.
ర్యాగింగ్ కు పాల్పడితే ఆడవాళ్ళయినా..మగవాళ్లైనా ఒకే విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొదటి పనిష్మెంట్ గా విద్యార్ధినిలను వారం రోజులు సస్పెండ్ చేశామని..మళ్లీ ఇటువంటివాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ ఫ్రీ యునివర్సిటీ తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని దాని కోసం కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడమని VC తాటికొండ రమేష్ తెలిపారు.
కాకతీయ వర్శిటీలో ర్యాగింగ్ కలకలం.. ఏకంగా 81 మంది అమ్మాయిల సస్పెన్షన్
కాగా వర్శిటీలో జరిగిన ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.ర్యాగింగ్ లాంటి ఘటనలపై ప్రభుత్వంగా స్పందించడం తమ బాధ్యత అన్నారు. ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేయూలో జరిగిన ఘటనపై కలెక్టర్ తో మాట్లాడతానని..వర్సిటీ పాలన యంత్రాంగంతో ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించి సమస్యలపై దృష్టి పెడతామని తెలిపారు. ర్యాగింగ్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.