వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక.. జిల్లాల వారీగా తుది పోలింగ్ వివరాలు ఇవే..

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక తుది పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది.

Graduate MLC bypoll: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లాల వారీగా తుది పోలింగ్ వివరాలను మంగళవారం ఈసీ వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 78.59 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 67.20 శాతం ఓటింగ్ జరిగిందని ఈసీ తెలిపింది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు
యాదాద్రి భువనగిరి : 78.59
జనగాం : 76.34
సిద్దిపేట : 76.13
ములుగు : 74.58
జయశంకర్ భూపాలపల్లి : 73.62
నల్గొండ : 73.29
సూర్యాపేట : 73.15
వరంగల్ : 72.68
హనుమకొండ : 72.45
మహబూబాబాద్ : 72.15%
భద్రాద్రి కొత్తగూడెం : 69.95
ఖమ్మం : 67.20

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సంచలన విషయాలు చెప్పిన రాధాకిషన్ రావు..! త్వరలో రాజకీయ నేతల అరెస్టులు?

ట్రెండింగ్ వార్తలు