Weather Update: తెలంగాణకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు..

కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నిన్న రాయలసీమ నుంచి పశ్చిమ -మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1కి. మీ., 5.8 కి. మీ మధ్యలో కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడిందని చెప్పారు.

కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని తెలిపారు. దీంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అన్నారు.

ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయని, తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాణ అధికారులు చెప్పారు.

Minister Narayana: ఆలోగా అన్న కాంటీన్ల ప్రారంభం: మంత్రి నారాయణ

ట్రెండింగ్ వార్తలు