Weather Updates: తెలంగాణను వదలను అంటున్న భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు.. ఈ అన్ని జిల్లాలకు అలెర్ట్ జారీ

ఈ జిల్లాల పరిధిలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy rains

Weather Updates: తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురవనున్నాయి. రేపు ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

ఈ జిల్లాల పరిధిలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (Weather Updates)

Also Read: Xiaomi 16 Series: షావోమీ 16 సిరీస్ వచ్చేస్తోందోచ్‌.. రెడీగా ఉండండి.. కొత్త డిజైన్.. శక్తిమంతమైన ఫీచర్లు ఇవే..

అదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి ములుగులో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ములుగు, కుమ్రం భీం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో భారీగా వర్షపాతం నమోదు అవుతోంది.