Tummala Nageswara Rao : రాజీనామా చేస్తారా? ప్రశ్నార్థకంగా తుమ్మల రాజకీయ భవిష్యత్తు, అనుచరుల కీలక సమావేశం

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తుమ్మలకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇస్తున్నారు. Tummala Nageswara Rao - Palair

Tummala Nageswara Rao - Palair

Tummala Nageswara Rao – Palair : ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకి పాలేరు టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీఎం కేసీఆర్ తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పాలేరు నియోజకవర్గం టికెట్ ను ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించారు. తుమ్మలకు సీటు దక్కకపోవడంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడినట్లు అయ్యింది.

ఇప్పుడు తుమ్మల చూపు ఎటువైపు? కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుందా? బీజేపీ గాలానికి చిక్కుతారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మల మాత్రం పాలేరు నుంచి తాను పోటీ చేసి తీరతానని చెబుతున్నారు. తుమ్మలను బుజ్జగించేందుకు మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తుమ్మలకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

Also Read..BJP Telangana: కాషాయ దళంలో హీట్‌పుట్టిస్తోన్న కిషన్ రెడ్డి, సంజయ్ వైఖరి!

ఖమ్మం నాయుడుపేటలోని ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తుమ్మల అనుచరులు రాజీనామా చేయాలని తీర్మానం చేశారు. పార్టీ మార్పుపై తుమ్మల ఆలోచన చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని తుమ్మల అనుకున్నట్లు సమాచారం.

Also Read..Mynampally Hanmanth Rao: వారితో మాట్లాడిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.. తప్పకుండా నా కొడుక్కి నేను సపోర్ట్ చేస్తా