Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో థాయిలాండ్ సుందరిని జడ్డీలు అడిగిన ప్రశ్న ఏంటి?

గత సంవత్సరం మిస్‌ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా.. 72వ ప్రపంచ సుందరి చువాంగ్‌కు కిరీటాన్ని అలంకరించారు.

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయిలాండ్‌కు చెందిన సుందరి నిలిచారు. ప్రపంచ సుందరి కిరీటాన్నీ ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ సొంతం చేసుకున్నారు. మిస్ వరల్డ్ గా తన పేరును ప్రకటించగానే సుచాత ఎమోషనల్ అయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. చివరికి విన్నర్ గా థాయిలాండ్ సుందరి నిలిచారు. గత సంవత్సరం మిస్‌ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా.. 72వ ప్రపంచ సుందరి చువాంగ్‌కు కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్‌గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు.

కాగా.. మిస్ వరల్డ్ ఫైనల్స్ లో జడ్జీలు ఏం ప్రశ్న అడిగారు, మిస్ థాయిలాండ్ ఏం జవాబు చెప్పారు.. ఆమెనే ఎందుకు విజేతగా ప్రకటించారు అనేది ఆసక్తికరంగా మారింది. మిస్ వరల్డ్ ఫైనల్ లో సోనూ సూద్ అడిగిన ప్రశ్నకు మిస్ థాయిలాండ్ చెప్పిన సమాధానం జడ్జీలను మెప్పించింది. ఆ సమాధానంతోనే ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

ఇంతకీ సోనూ సూద్ ఏం అడిగారంటే..
ఈ ప్రయాణం మీకు నేర్పిన నిజం ఏంటి? ఎలాంటి వ్యక్తిగత బాధ్యత నేర్పింది?

దీనికి థాయిలాండ్ సుందరి ఇచ్చిన సమాధానం ఇదే..
నా ప్రియమైన వారు నన్ను గౌరవించే వ్యక్తిగా మారడం నేను ఈ పోటీల ద్వారా నేర్చుకున్నాను. నా చర్యలు ఎల్లప్పుడూ నా విలువలను ప్రతిబింబించాలని ఓపాల్ సుచతా చువాంగ్‌శ్రీ నొక్కి చెప్పారు.

మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుచాత 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకుంటారు. సుచాత.. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. సుచాతకు ప్రపంచ సుందరి కిరీటం దక్కడంతో థాయిలాండ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.

సుచాత.. ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ నినాదంతో మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ ముప్పు నుంచి బయటపడిన ఆమె.. థాయిలాండ్‌లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉండేందుకు నిధుల సేకరించడంతోపాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.

గత 20 రోజులుగా ప్రపంచాన్ని అలరించిన అందాల పోటీలు రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్‌ హైటెక్స్‌ లో ఫైనల్స్ జరిగాయి. క్వార్టర్‌ ఫైనల్స్‌కు 40 మంది ఎంపికవ్వగా.. ఒక్కో ఖండం నుంచి ఇద్దరు ముందంజ వేశారు. ఇలా ఫైనల్‌ రౌండ్‌కు నలుగురు ఎంపికవగా.. అందులో థాయిలాండ్‌ సుందరి సుచాతను మిస్‌ వరల్డ్‌ కిరీటం వరించింది.

కాగా, మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయారు. ఆసియా అండ్ ఓషియానియా ఖండం నుంచి టాప్ 8కి ఫిలిప్పీన్స్, థాయిలాండ్ అందగత్తెలు ఎంపికయ్యారు.