Rajiv yuva vikasam scheme
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను అమలు చేసే క్రమంలో మరింత జాప్యం జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌ను జూన్ 2నే తొలి దశ కింద రూ.లక్షలోపు యూనిట్లను మంజూరు చేయాలనుకున్నప్పటికీ అది వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
దీంతో అనర్హులను గుర్తించాలని, అప్లికేషన్లను పునఃపరిశీలించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ ఈ స్కీమ్‌పై నిర్ణయం తీసుకోలేదు. అప్లికేషన్లను హోల్డ్‌లో పెట్టాలని కలెక్టర్లకు సర్కారు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ స్కీమ్ అమలులో జాప్యం తప్పదని తెలుస్తోంది.
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అధికారులదే అని నిబంధన ఉంది. దీని ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారుల అధీనంలో ఉండాల్సి ఉంది. అయితే, తుది జాబితాకు మంత్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
Also Read: ఈ 5 స్మార్ట్‌ఫోన్లు అదుర్స్.. వీటిని ఎందుకు కొనొచ్చంటే?
ఎమ్మెల్యేలు సూచించిన వారినే ఎంపిక చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సూచించిన అభ్యర్థులే ఎంపిక కావడం వల్ల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంని వెనక్కి తగ్గినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
రాజీవ్ యువ వికాసం స్కీమ్ లెక్కలు ఇలా