Bhadradri Kothagudem: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు కృష్ణతో కలిసి భర్త రామును హత్య చేసింది లలిత. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని గోదావరి నది ఇసుకలో పూడ్చిపెట్టారు. గత కొద్దీ రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో ఆమె పిల్లలు తండ్రి గురించి తల్లి లలితను ప్రశ్నిచగా లారీ పనికి వెళ్లాడని త్వరలోనే తిరిగి వస్తాడని చెప్పింది.

Bhadradri Kothagudem

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అజ్మీరా రాము, లలితా భార్య భర్తలు. లలిత, కృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడు కృష్ణతో కలిసి భర్త రామును హత్య చేసింది లలిత. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని గోదావరి నది ఇసుకలో పూడ్చిపెట్టారు. గత కొద్దీ రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో ఆమె పిల్లలు తండ్రి గురించి తల్లి లలితను ప్రశ్నిచగా లారీ పనికి వెళ్లాడని త్వరలోనే తిరిగి వస్తాడని చెప్పింది.

అయితే లలిత ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె అత్తామామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన 15 రోజుల తర్వాత కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా లలితను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో ఆమె భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. తన ప్రియుడు కృష్ణతో కలిసి భర్తను హత్యచేసి గోదావరి నది ఇసుకలో పూడ్చి పెట్టమని తెలిపింది.

దీంతో డాగ్ స్క్వాడ్ తీసుకోని ఘటన స్థలికి వెళ్లి అస్థిపంజరాలను వెలికితీశారు పోలీసులు. అనంతరం లలిత, ఆమె ప్రియుడు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.