Wife Illegal Affair
Crime News: ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య ఏకంగా హత్య చేయించింది. పక్కాప్లాన్ తో ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించింది.. చివరకు పోలీసులు కేసును చేధించి అసలు గుట్టును రట్టు చేశారు. భార్య, ఆమె ప్రియుడే హతకులని తేల్చారు. ఈ ఘటన రంగారెడ్డి శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
India vs England 3rd ODI: నేడు భారత్ – ఇంగ్లండ్ మధ్య చివరి సమరం.. కోహ్లీవైపు అందరిచూపు
కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య (43) జయసుద దంపతులు. 14ఏళ్ల క్రితం పటాన్ చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకున్నాడు. అక్కడికి వారానికోసారి వచ్చి వెళ్తుండేవాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్ తో రెండు నెలల క్రితం పరిచయం.. అక్రమ సంబంధంగా మారింది. జిమ్ ట్రైనర్‌ది విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామం.
CM KCR Aerial Survey: వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే
శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతన్ని చంపేస్తే మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని జయసుధ ప్రియుడికి చెప్పింది. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని, ఎలాగైనా హత్యచేయాలని ప్రియుడిపై ఒత్తిడి చేసింది. దీంతో శంకరయ్య తోట నుంచి వస్తుండగా టంగటూర్ గ్రామ శివారులో తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతుకోసి జిమ్ ట్రైనర్ పరారయ్యాడు. పోలీసులు నిందితుడు వాడిన ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా శుక్రవారం జిమ్ ట్రైనర్ హత్యకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నాడు. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని భావించి భార్యనే ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.