Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? తెలంగాణలో మరో ఉపఎన్నిక రాబోతుందా?

మరో ఏడాది వరకు ఎన్నికలే లేవనుకుంటున్న తెలంగాణలో.. మరో ఉపఎన్నిక రాబోతోందా? అదే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాబోతోందా? ఇన్నాళ్లు ఉపఎన్నికలకు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కేరాఫ్ అయితే.. ఈసారి ఆ ప్లేస్‌ను కాంగ్రెస్ రీప్లెస్ చేయబోతోందా? మునుగోడు అందుకు వేదిక కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

Komatireddy Rajagopal Reddy : మరో ఏడాది వరకు ఎన్నికలే లేవనుకుంటున్న తెలంగాణలో.. మరో ఉపఎన్నిక రాబోతోందా? అదే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాబోతోందా? ఇన్నాళ్లు ఉపఎన్నికలకు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కేరాఫ్ అయితే.. ఈసారి ఆ ప్లేస్‌ను కాంగ్రెస్ రీప్లెస్ చేయబోతోందా? మునుగోడు అందుకు వేదిక కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

ఆయనతో రాజీనామా చేయించి.. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపేందుకు బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాని గురించే కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి చర్చించారనే ప్రచారం జరుగుతోంది. అటు మునుగోడుపై బీజేపీ కంటే ముందే సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. సైలెంట్‌గా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యర్ధికి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా.. ఇప్పటికే నియోజకవర్గానికి మంత్రి జగదీశ్‌రెడ్డిని పంపి ప్రజా సమస్యలపై ఆరా తీయించారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.

Komatireddy Rajgopal Reddy : బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో చర్చలు జరిపారు. మునుగోడు నియోజకవర్గానికి ఇవాళ తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై ముందు నుంచి అనుమానంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఉపఎన్నిక వార్తలతో అలర్ట్ అయింది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షాతో భేటీ తర్వాత మునుగోడు అభ్యర్ధిని ఎంపిక చేసే పనిలో పడింది. జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నిన్న పలువురు నేతలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. బరిలో దిగేందుకు సిద్ధంగా ఉండాలని రఘువీర్‌కు సందేశం పంపినట్లు విశ్వసనీయ సమాచారం.

ట్రెండింగ్ వార్తలు