Hanuman Shobha Yatra 2022 In Hyderabad
Hanuman shobha yatra 2022 in hyderabad రేపు (ఏప్రిల్ 15,2022) హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు హైదరాబాద్ నగరం సిద్ధమువుతోంది. ఈ శోభాయాత్రం సందర్భంగా పలు ఆంక్షలు కూడా అమలు జరుగనున్నాయి. రేపు హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్న క్రమంలో పలు ఆంక్షలు విధించారు అధికారులు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది.
ఆంక్షల్లో భాగంగా 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 17,2022)ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.
అలాగే హనుమాన్ శోభా యాత్ర సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించి డైవర్షన్ రూట్లను వెల్లడించారు. ఏయే రూట్లలో వెళ్లాలో సూచించారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ లోని హనుమాన్ టెంపుల్ కు చేరుకుని ముగుస్తుందని చెప్పారు. కాబట్టి 9 గంటల నుంచి 2 గంటల మధ్య, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల మధ్య వెళ్లాల్సిన రూట్ల వివరాలను పేర్కొన్నారు.
ఆంక్షలు ఇలా..
-లక్డీ కా పూల్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లాలనుకునే వారు.. బషీర్ బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణ గూడ ఫ్లై ఓవర్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, రైట్ టర్న్ తిలక్ నగర్ రోడ్, 6 నం జంక్షన్, అలీ కేఫె క్రాస్ రోడ్, మూసారాంబాగ్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్లాలి.
-దిల్ సుఖ్ నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లాలనుకునేవారు.. ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ ఓఆర్, చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా మెహిదీపట్నం వెళ్లాలన్నారు.
మధ్యాహ్నం 2 నుంచి 7 గంటలు
-లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ లేదా ఉప్పల్ వెళ్లే వారు వీవీ స్టాట్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైజ్ ఫ్లై ఓవర్ ల మీదుగా ఉప్పల్ కు వెళ్లవచ్చు. ఆయా రూట్లకు తగ్గట్టు ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు.