Hanuman Jayanti : హైద‌రాబాద్‌లో రేపు కఠిన ఆంక్షలు.. మ‌ద్యం దుకాణాలు బంద్..!

హైదరాబాద్ నగరంలో రేపు (శనివారం) మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి, శోభాయాత్ర సందర్భంగా నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

Wine Shops To Remain Closed Across Hyderabad On Hanuman Jayanti

Hanuman Jayanti : హైదరాబాద్ నగరంలో రేపు (శనివారం) మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి, శోభాయాత్ర సందర్భంగా నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6  గంటల నుంచి ఆదివారం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌ద్యం విక్రయించేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని పోలీసులు హెచ్చ‌రించారు.

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్ నగరంలో శనివారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభయాత్ర కొనసాగే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ హనుమాన్ శోభాయాత్ర‌ గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బ‌న్‌లోని హ‌నుమాన్ మందిర్ వ‌ర‌కు కొనసాగనుంది. క‌ర్మ‌న్‌ఘాట్ హ‌నుమాన్ దేవాలయం నుంచి మ‌రో శోభయాత్ర నిర్వహించనున్నారు. క‌ర్మ‌న్‌ఘాట్ నుంచి చంపాపేట్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నారాయ‌ణ‌గూడ మీదుగా తాడ్‌బ‌న్‌లోని హ‌నుమాన్ మందిర్ వ‌ర‌కు హనుమాన్ శోభయాత్ర కొన‌సాగ‌నుంది.

Read Also : Hanuman shobha yatra : రేపు హనుమాన్ శోభాయాత్ర..మద్యం షాపులు,బార్స్,పబ్ లు బంద్..ట్రాఫిక్ ఆంక్షలు