స్కూల్ కు వెళ్లకుండానే…పది పరీక్షలు రాయొచ్చు

  • Publish Date - September 23, 2020 / 07:35 AM IST

ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2020 – 21) ఇలాంటి వెసులుబాటు ఇవ్వాలని భావిస్తోంది.



అయితే..ఇక్కడ అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకొంటోంది.
పాఠశాల ద్వారానే విద్యార్థుల వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి (SSC Board)కు సమర్పించాల్సి ఉంటుంది. కానీ..ప్రస్తుతం కరోనా కారణంగా స్కూల్స్ తెరుచుకోలేదు. ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. కనీసం ఫీజులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ తీవ్ర వత్తిడి తెస్తున్నాయి. చివరకు మొత్తం ఫీజులు చెల్లిస్తే గాని పరీక్షలకు అనుమతినిస్తామని చెప్పే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా, టీవీ పాఠాలతో చదువుకుంటూ..10వ తరగతి పరీక్షల రాసే అవకాశం ఇవ్వాలని బోర్డు అధికారులు యోచిస్తున్నారు.



అంతర్గత మార్కులు (సబ్జెక్టు 20) రద్దు చేసే దిశగా..నిర్ణయం తీసుకొంటే..నేరుగా పరీక్షలు రాసే విధానం అమలు చేయవచ్చని కొందరు సూచిస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు