Hanumakonda District : కారు నుంచి తీవ్ర దుర్వాసన.. డిక్కీ తెరిచి చూడగా షాక్.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు.. ప్రియుడు మోజులో పడి..
Hanumakonda District : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- August 22, 2026 / 07:37 AM IST
woman Dead body
Hanumakonda District : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు డిక్కీ ఓపెన్ చేసిచూడగా అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వండంతో వారు ఘటన స్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ దారా కవిత మీడియాకు వెల్లడించారు.
Also Read : Sowcar Janaki: చిత్రసీమలో తీవ్ర విషాదం.. షావుకారు జానకి కన్నుమూత
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన వినోద్ కుమార్ కరీంనగర్‌లో ఉంటున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాజేశం కుమార్తె అంకితి మానస (38) వివాహిత. ఆమెకు వినోద్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయంకాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. వారిద్దరూ కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. కాగా.. సుమారు ఐదు రోజుల క్రితం మానస తన కుటుంబ సభ్యులకు, తండ్రికి తాను తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలం వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి కరీంనగర్‌లో వినోద్ కుమార్ వద్దకు చేరుకుంది.
వినోద్ కుమార్, మానస మధ్య ఈ నెల 19న తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వినోద్ కుమార్ మానసను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ హత్యను కప్పిపుచ్చేందుకు మానస మృతదేహాన్ని గుర్తుతెలియని ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఖననం చేయాలని నిర్ణయించాడు. అయితే, ఎల్కతుర్తికి చెందిన తుంగళ్లపల్లి సురేందర్ అనే వ్యక్తి తన కారును సమ్మిరెడ్డి వద్ద రూ.2లక్షలకు తాకట్టు పెట్టాడు. ఆ కారు వినోద్ కుమార్ వద్ద ఉంది. అతనే వాడుతున్నాడు. మానస మృతదేహాన్ని ఆ కారు డిక్కీలో పడేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి ఎల్కతుర్తికి చేరుకున్నాడు.
ఎల్కతుర్తిలోని బస్టాండ్ సమీపంలో తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కారును వినోద్ కుమార్ పార్క్ చేశాడు. అయితే, కారు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు ఈనెల 20న ఆ కారు డిక్కీని ఓపెన్ చేసి చూడగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. మృతదేహం మానసదిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
