Road Accident
Woman killed in road accident : మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పల్ డిపో సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనగామ జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, కనకయ్య దంపతులు. ఆదిలక్ష్మి, కనకయ్యలు బైక్ పై బాలానగర్ నుండి జనగామ అడవికేశవపురంకు బైక్ పై వెళ్తున్నారు.
మార్గంమధ్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పల్ డిపో సమీపంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను ఆటో ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనకభాగంలో కూర్చున్న ఆదిలక్ష్మి(30) అనే మహిళ బైక్ పై నుండి పక్కగా వెళ్తున్న ఆర్టీసీ బస్ క్రింద పడింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
Pankaj Chowdhury : తెలంగాణ అప్పులు 2లక్షల 37వేల కోట్లు!
ఆదిలక్ష్మి భర్త కనకయ్యకి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కనకయ్యను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.