Pankaj Chowdhury : తెలంగాణ అప్పులు 2లక్షల 37వేల కోట్లు!

గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద రుణభారం రూ. 2,37,747 కోట్లు ఉందని కేంద్రమంత్రి పంకజ్ చౌదురి సమాధానం చెప్పారు.

Pankaj Chowdhury : తెలంగాణ అప్పులు 2లక్షల 37వేల కోట్లు!

Pankaj

Updated On : December 20, 2021 / 4:24 PM IST

Telangana’s debt is Rs 2,37,747 crore : తెలంగాణ అప్పులు 2,37,747 కోట్లు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయంగా వివిధ సంస్థలు బ్యాంకుల నుంచి 2,34,912 కోట్లు, విదేశీ సంస్థల నుంచి 2835 కోట్ల అప్పులు తీసుకుందని వెల్లడించారు.

నవంబర్ 30, 2021 వరకు మొత్తం తెలంగాణ అప్పులు 2,37,747 కోట్లుగా ఉందని, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి లిఖితపూర్వక సమాధానం చెప్పారు.

గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద రుణభారం రూ. 2,37,747 కోట్లు ఉందని తెలిపారు. ఇందులో రూ. 2,835 కోట్లు విదేశాల నుంచి తీసుకున్న రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో విదేశీ రుణాల రూపంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి అదనపు సహాయం లేదని స్పష్టం చేశారు.

CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్‌లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్

తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.382.21 కోట్ల మేర విదేశీ రుణాలు, రూ. 147.53 కోట్ల మేర వడ్డీ చెల్లింపులు జరిపిందని వెల్లడించారు. జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ నుంచి తెలంగాణ రుణాలు తీసుకుందని తెలిపారు.