Filmnagar Accident : ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం.. హై హీల్స్ భుజాన వేసుకుని వెళ్లిపోయిన యువతి

కాగా, ప్రమాద స్థలంలో గుడిసెలో ఒక వాచ్ మెన్ ఫ్యామిలీ ఉంది.  గుడిసెకి అడుగుదూరంలో కారు ఆగింది.

Filmnagar Accident : ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం.. హై హీల్స్ భుజాన వేసుకుని వెళ్లిపోయిన యువతి

Filmnagar Car Accident

Filmnagar Car Accident : హైదరాబాద్ (Hyderabad) లోని ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారుతో సోమవారం ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ (Woman Rash Driving ) చేశారు. ఓవర్ స్పీడ్ తో వెళ్లిన కారు చెట్టు, ఎలక్ట్రికల్ పోల్, గోడని ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి కారు రెండు టైర్లు విడిపోయి కొంత దూరంలో పడ్డాయి.

అయితే, ఎయిర్ బ్యాగ్స్ (Air Bags) ఓపెన్ అవడంతో కారులోని మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి తన హై హీల్స్ భుజాన వేసుకుని అక్కడి యువతి వెళ్ళిపోయారు. కాగా, ప్రమాద స్థలంలో గుడిసెలో ఒక వాచ్ మెన్ ఫ్యామిలీ ఉంది. గుడిసెకి అడుగుదూరంలో కారు ఆగిపోయింది.

Culvert Collapses Five Killed : ఒడిశాలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలి ఐదుగురు మృతి

వాచ్ మెన్ ఫ్యామిలీకి ప్రాణాపాయం తప్పింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. సమాచారం తెలుసుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.