Allegations On MLA : కోరిక తీర్చాలని, అమ్మాయిలను పంపాలని వేధించారు-ఎమ్మెల్యేపై మహిళ తీవ్ర ఆరోపణలు

బ్రోకర్ల సాయంతో అమ్మాయిలను పంపించానని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కోరిక తీర్చాలని తనను కూడా ఆ ఎమ్మెల్యే వేధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.(Allegations On MLA)

Allegations On MLA : అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను వేధించారని, తప్పుడు కేసులు పెట్టారని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారని ఓ ప్రైవేట్ డెయిరీ నిర్వాహకురాలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.

తనతో ఎమ్మెల్యే చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాటింగ్ లను ఆమె బయటపెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడి భరించలేక బ్రోకర్ల సాయంతో అమ్మాయిలను పంపించానని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కోరిక తీర్చాలని తనను కూడా ఆ ఎమ్మెల్యే వేధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే చాటింగ్, లొకేషన్ షేరింగ్ కు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పెట్టిన చాటింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది.

Also Read..MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్య కంటతడి

డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరిస్తానంటూ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆ మహిళ ఆరోపించారు. డెయిరీ సంస్థ విస్తరణ కోసం ఎమ్మెల్యే చెప్పినట్లు విన్నానని, హైదరాబాద్ కు వెళ్లినప్పుడల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనకు సపర్యలు చేశాననన్నారు. అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేస్తే పంపానన్నారు.(Allegations On MLA)

ఇంతచేసినా.. చివరికి తమపైనే ఆ ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించి వేధించారని ఆమె వాపోయారు. ఎమ్మెల్యేని మొదటిసారి తమ బ్రాంచ్ ఓపెనింగ్ సమయంలో కలిశానన్నారు ఆ మహిళ. కంపెనీలో తన వాళ్లకి షేర్ ఇస్తే ఫుల్ సపోర్ట్ ఇస్తానని ఎమ్మెల్యే అన్నట్టు ఆ మహిళ తెలిపారు. ఏం కావాలన్నా చేసి పెడతానని ఎమ్మెల్యే చెప్పారన్నారు. ఎమ్మెల్యే చెప్పినదానికి తాము ఓకే చెప్పేసరికి 2 ఎకరాల స్థలాన్ని ఆఫర్ చేశారన్నారు. అందుకోసం రూ.20లక్షలు అడ్వాన్స్ గా చెల్లించామన్నారు.

Also Read..Janakipuram Sarpanch Navya : కిరోసిన్‌ పోసి తగలబెడతా-ఎమ్మెల్యే పేరు ఎత్తకుండానే సర్పంచ్‌ నవ్య స్ట్రాంగ్ వార్నింగ్

అయితే, తన దగ్గర డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యే.. ఆ డబ్బుని ఆయన తన పర్సనల్ పనులకు వాడుకున్నారని ఆమె ఆరోపించారు. పైగా చెప్పింది చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు చేశారు. దళితబంధు గురించి మాట్లాడాలని ఒత్తిడి చేసి తన ఇంటికి పిలిపించారని, తాము తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్ చేశారని ఆ మహిళ ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యేపై మహిళ చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే, ఆ ఆరోపణలో నిజమెంత? అనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేని ఇరికించడానికి పథకం ప్రకారం ఆ మహిళ ఇలా వ్యవహరించిందా? అన్న చర్చ కూడా జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు