MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్య కంటతడి

స్టేషన్ ఘనపూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాజయ్య కంటతడి పెట్టారు.

MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్య కంటతడి

rajayya

MLA Rajaiah : స్టేషన్ ఘనపూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాజయ్య కంటతడి పెట్టారు. బోరున విలపించారు. 63 ఏళ్ల వయస్సున్న తాను నలుగురు అక్కాచెళ్లెళ్లున్న కుటుంబంలో పెరిగానని తెలిపారు. తన ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఒక చెళ్లని చేరదీసే పరిస్థితి లేదని, ఒక అక్క పక్కన నిలబడే లేని స్థితికి తీసుకొచ్చి అసత్య ఆరోపణలతో తనన వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

MLA Rajaiah Vs Women Sarpanch : మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

తన కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రండ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్ లో 5వ సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని స్పష్టం చేశారు. ఏ సర్వేలో చూసిన స్టేషన్ ఘనపురం గెలుపు బాటలో పయనిస్తుందన్నారు.

ఇటీవలే మహిళా సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య వివాదం నెలకొంది. రాజయ్యపై నవ్య పలు ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై రాజయ్య స్పందిస్తూ నవ్య చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. వీరిదద్దరి మధ్య వివాదం కలకలం రేపింది.