Former MLA Arrest : యువ హీరో ఫాంహౌస్‌ పేకాట కేసు..మాజీ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్..నాగశౌర్య తండ్రికి నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో ఫాంహౌస్‌ పేకాట కేసు ప్రకంపనలు రేపుతోంది. గంటగంటకు కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య సహా 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Cards Case

young hero farmhouse cards case : తెలుగు రాష్ట్రాల్లో ఫాంహౌస్‌ పేకాట కేసు ప్రకంపనలు రేపుతోంది. గంటగంటకు కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య సహా 30 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు పోలీసుల నోటీసులు పంపారు. నాగశౌర్య తండ్రి వద్ద విల్లాను ప్రధాన నిందితుడు సుమన్ చౌదరి దగ్గర అద్దెకుకు తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో విల్లాను అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెంటల్‌ అగ్రిమెంట్‌తో పోలీసుల ముందు విచారణకు నాగశౌర్య తండ్రి హాజరుకానున్నారు.

హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్ పేకాట కేసులో విచారణ కొనసాగుతోంది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. సుమన్‌కు- నాగశౌర్యకు మధ్య సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. తెరపైకి నాగశౌర్య బాబాయ్‌ బుజ్జి పేరు కూడా వస్తోంది. బుజ్జిపై వస్తున్న అనుమానాలపై అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. గుత్తా సుమన్‌ ఫోన్‌ని సీజ్ చేసిన పోలీసులు.. నగరానికి చెందిన 25 మంది ప్రముఖుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను రిమాండ్‌కు తరలించనున్నారు.

Hyderabad : యువ హీరో ఫామ్‌హౌజ్‌లో పేకాట గుట్టురట్టు..రూ.6 లక్షల 77 వేలు, 20 కార్లు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రంలో పేకాటపై నిషేధం ఉంది. కానీ కొంతమంది పేకాటరాయుళ్లు అవేవీ పట్టించుకోవట్లేదు. సాయంత్రమవుతుంటే చాలు.. ఏదో పెద్ద పని ఉన్నట్లు చేయి తిప్పేందుకు హైదరాబాద్ శివారు బాట పడుతున్నారు. సిటీకి నలువైపులా ఉన్న ఫామ్‌హౌజ్‌లలో పేకాట ఆడేస్తున్నారు కళావర్ కింగ్‌లు. రాజేంద్రనగర్‌ ఏరియా.. మంచిరేవుల గ్రామంలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఇలానే ముక్కలు తిప్పుతున్న పేకాట పాపారావులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.