Heart
Young Man Heart Stroke : మృత్యువు ఎప్పుడు వస్తందో ఎవరికీ తెలియదు. ప్రమాదం రూపేనా రావొచ్చు..లేదా అనారోగ్యంతో కావచ్చు..ఇతరత్రా కారణాలతో మనుషులు చనిపోతుంటుంటారు. కానీ మరణం అనేది ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. సడెన్ గా చనిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా..ఓ వ్యక్తి స్కూటీపై వెళుతూ..హాఠాత్తుగా గుండెపోటు రావడంతో నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతొక్కరూ దిగ్ర్భాంతికి లోనయ్యారు.
Read More : Hang Clothes Balconies : మీ బాల్కనీల్లో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి.. పోలీసుల హెచ్చరిక!
జడ్చర్ల పట్టణంలోని పాతబజార్ కు చెందిన రాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2021, నవంబర్ 19వ తేదీ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని..మిత్రులకు చెప్పుడు. వెంటనే ఓ మిత్రుడు స్కూటీ తీసుకుని రాజు ఇంటికి వచ్చి..అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత..రాజుకు గుండెపోటు రావడంతో…స్కూటీ నుంచి రోడ్డుపై కిందపడిపోయాడు. ఘటనాస్థలంలోనే చనిపోయాడు. వెంటనే అతను మిత్రుడు రాజును రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాజు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.