Hyderabad Accident : మద్యం మత్తుకు నిండు ప్రాణం బలి.. మరొకరి పరిస్థితి విషమం

ఫుటుగా మద్యం సేవించిన ఇంజినీరింగ్ విద్యార్థి వేగంగా కారు నడిపి బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్రగాయాలయ్యాయి.

Hyderabad Accident

Hyderabad Accident : ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా.. ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరి తీరు మారడం లేదు. మద్యం సేవించి వాహనం నడిపితే నేరం అని తెలిసికూడా నిబంధనలు తుంగలోతొక్కి ఫుటుగా మద్యం సేవించి వాహనాలను రోడ్డెక్కిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని తాజ్ డ్రైవ్ ఇన్ హోటల్ల్ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే.. ఘట్‌కేసర్‌ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది.

చదవండి : Road Accident : ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

ఫుటుగా మద్యం సేవించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నిఖిల్‌రెడ్డి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బైక్‌పై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కకడే మృతి చెందింది. ఆమె భర్త హనుమాన్ దాస్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఘటన అనంతరం పారిపోయేందుకు యత్నించిన నిఖిల్ రెడ్డిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

చదవండి : Road Accident : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి-అనాధలవటంతో అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే

ఇక తీవ్ర గాయాలు కావడంతో అతడికి ఆపరేషన్ చేయాలనీ వైద్యులు నిర్దారించారు. ఈ సర్జరీకి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మద్యం సేవించి ఒకరి ప్రాణం తీసిన నిఖిల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిఖిల్ రెడ్డిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలనీ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.