Car Accident : మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్.. అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిన కారు

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. లేకుంటే పెను విషాదం జరిగి ఉండేది. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Car Accident

car accident in Vanasthalipuram : హైదరాబాద్‌ వనస్థలిపురంలో మందుబాబులు బీభత్సం సృష్టించారు. కారుతో ఓ అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టారు. న్యూఇయర్‌ సందర్భంగా పీకలదాకా మద్యం సేవించిన యువకులు…మత్తులో కారు నడుపుతూ అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టారు. ఆంధ్రకేసరి నగరలో జరిగిన ఈ ప్రమాదం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. లేకుంటే పెను విషాదం జరిగి ఉండేది. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. న్యూఇయర్‌ కేకుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

MD Sajjanar : టీఎస్ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందికి గుడ్ న్యూస్

ఆంధ్రకేసరి నగర్‌లో తరచూ మందుబాబులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.