YS Sharmila, KTR
YS Sharmila – KTR: చిన్నదొర కేటీఆర్ గారూ.. అంటూ వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ (YSR) ఇమేజ్ ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ (KCR) కు ఉన్న ఇమేజ్ యాంటీ పూర్ అని చెప్పారు.
కేసీఆర్ ఒక యాంటి ఫార్మర్ అని, ఆయన పాలన యాంటీ యూత్, ఆయన ప్రభుత్వం యాంటీ విమెన్, ఆయన అంటేనే యాంటీ మైనారిటీస్ అని విమర్శించారు. అవినీతి అంటే కేసీఆర్ అని, కేసీఆర్ అంటే కరప్షన్ అని చెప్పుకొచ్చారు.
నాగలోకానికి, నక్కకు ఎంత తేడా ఉందో వైఎస్సార్ పాలనకు, కేసీఆర్ పాలనకు అంత తేడా ఉందని షర్మిల చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సమతుల్య అభివృద్ధి అని చెబుతున్న కేటీఆర్ కు ఓ సవాల్ విసురుతున్నానని అన్నారు.
” మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం, మీరు రియల్ ఎస్టేట్ స్కాం చేయలేదని, మీరు సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా? ” అని అన్నారు.