YS Sharmila Serious On TRS Govt : ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు’ : వైఎస్ షర్మిల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. అవినీతిపై ప్రశ్నిస్తే.. అరెస్టులా? అని నిలదీశారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారన్న ఆమె..నేడు తనను కూడా చంపాలనుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila Serious On TRS Govt

YS Sharmila Serious On TRS Govt : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. బేడీలు తీసుకుని షర్మిల మీడియా సమావేశానికి వచ్చారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ షర్మిల బేడీలు చూపించారు. ‘అరెస్టుకు నేను రెడీ.. మీరు రెడీనా?’ అంటూ సవాల్ చేశారు.

గుర్తుపెట్టుకో కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాజన్న బిడ్డతోనా మీరు రాజకీయాలు చేసేదంటూ వ్యాఖ్యానించారు. తనను మరదలు అంటే ఊర్కుంటానా.. అని మండిపడ్డారు. అది నోరా.. మోరీనా? ఘాటుగా స్పందించారు.

YS Sharmila : ఈసారి చెప్పుతోనే.. మరింత దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

మాట్లాడటమే తప్పా? అని అన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తే.. అరెస్టులా? అని నిలదీశారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారన్న ఆమె..నేడు తనను కూడా చంపాలనుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.