jogini shyamala : మహిళ బట్టలు విప్పి వీడియోలు తీసి.. జోగిని శ్యామలపై ఎఫ్ఐఆర్

బోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన జోగిని శ్యామల వివాదంలో చిక్కుకుంది. ఆమెపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.

zero fir registered against jogini shyamala: బోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన జోగిని శ్యామల వివాదంలో చిక్కుకుంది. ఆమెపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ మహిళ శ్యామలపై ఫిర్యాదు చేసింది. దైవ దర్శనానికి వెళ్లిన తనపై దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని శ్యామలతో పాటు మరో 15 మందిపై మహిళ ఫిర్యాదు చేసింది. తన దుస్తులు విప్పి.. శ్యామల వీడియోలు తీశారని బాధితురాలు ఆరోపించింది. శ్యామలపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు జోగిని శ్యామలతో పాటు 15మందిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సికింద్రాబాద్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న స్రవంతి తన తల్లి తలారి సంధ్య మార్చి 12న మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారికి జోగిని శ్యామల ఎదురయ్యారు. తాము ఉంటున్న ప్రదేశానికి రావాలంటూ అభ్యర్థించడంతో తల్లి, కుమార్తె జోగిని నివాసానికి వెళ్లారు. అక్కడ అప్పటికే సుమారు 15 మంది పురుషులు మరో మహిళ ఉండడాన్ని గమనించిన స్రవంతి లోనికి వెళ్లేందుకు సందేహించింది. మరోమారు శ్యామల అభ్యర్థించడంతో లోనికి వెళ్లారు.

కాసేపటి తర్వాత శ్యామల.. తన కుటుంబాన్ని దూషించినట్లు బాధితురాలు ఆరోపించింది. తన భర్తని ఉద్దేశించి నీ భర్త పెంపుడు కుక్క అంటూ దూషించారని వాపోయింది. ఇదేమిటని నిలదీయడంతో ఆగ్రహానికి గురైన శ్యామల మరికొంత మంది కలిసి తనపై దాడి చేయడమే కాక, తనను వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. మార్చి 13వ తేదీ ఉదయం బాధితురాలు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఈ కేసును సోమవారం(మార్చి 15,2021) పాపన్నపేట పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు