Pakistani national Seema Haider : సీమా హైదర్ కేసులో వెలుగుచూసిన సంచలన విషయాలు

ప్రేమికుడి కోసం పాకిస్థాన్ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భారత్‌కు అక్రమంగా వచ్చిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు పాక్ అధీకృత పాస్‌పోర్ట్‌లు, అసంపూర్ణ పేరు, చిరునామాతో కూడిన ఉపయోగించని పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డును ఉత్తరప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.....

Pakistani national Seema Haider : ప్రేమికుడి కోసం పాకిస్థాన్ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భారత్‌కు అక్రమంగా వచ్చిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు పాక్ అధీకృత పాస్‌పోర్ట్‌లు, అసంపూర్ణ పేరు, చిరునామాతో కూడిన ఉపయోగించని పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డును ఉత్తరప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (4 mobile phones, 5 Pakistani passports recovered)

యూపీ పోలీసుల దర్యాప్తు

ఆన్ లైన్ గేమ్ పబ్ జి ఆడుతున్నపుడు పరిచయమైన సచిన్ మీనాను కలిసేందుకు సీమా నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి వచ్చి నోయిడాలో నివాసం ఉంటోంది. ( Seema Haider sneaked into India) సీమా, సచిన్ ప్రేమకథలో ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం దర్యాప్తు చేసింది. (UP Police) అనంతరం ఈ కేసును యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

రూ.12లక్షలతో పాక్‌లో ఇల్లు కొనుగోలు

సీమా హైదర్ భర్త గులాం 2019 వ సంవత్సరం నుంచి సౌదీఅరేబియాలో పనిచేస్తూ తన భార్య ఇంటి ఖర్చుల కోసం నెలకు 70 నుంచి 80 వేల పాకిస్థానీ రూపాయలను పంపించేవాడని ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది. సీమా భర్త పంపిన డబ్బు, తన అత్తయ్య, బంధువుల సహకారంతో రూ.12 లక్షల విలువగల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. సీమా అనంతరం కొన్న ఇంటిని మూడు నెలల్లోనే విక్రయించి, తన ప్రియుడితో కలిసి ఉండేందుకు భారతదేశానికి వచ్చింది. సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంటా అనే కోణంలో పోలీసులు, ఐబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

టూరిస్టు వీసాపై వచ్చి…

మార్చి 10వతేదీన సీమా కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లి, ఆపై టూరిస్ట్ వీసాపై ఖాట్మండుకు వచ్చింది. సచిన్ మీనా మార్చి 8వతేదీన గోరఖ్‌పూర్‌కు చేరుకుని రెండు రోజుల తర్వాత ఖాట్మండుకు చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. సచిన్ విమానాశ్రయానికి వెళ్లి సీమాను కలిసి వారిద్దరూ హోటల్ గదిలో అక్కడ ఏడు రోజులు గడిపారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

నలుగురు పిల్లల్ని తీసుకువచ్చిన సీమా

రెండు నెలల తర్వాత సీమా టూరిస్ట్ వీసాపై తన నలుగురు పిల్లలైన ఫర్హాన్ అలియాస్ రాజ్ (7 సంవత్సరాలు), ఫర్వా అలియాస్ ప్రియాంక (6 సంవత్సరాలు), ఫరీహా అలియాస్ పరి (5 సంవత్సరాలు), మున్నీ (3 సంవత్సరాలు)తో కలిసి దుబాయ్ చేరుకుంది. ఒక రోజు తర్వాత ఆమె ఖాట్మండుకు వెళ్లి మే 11వతేదీన హిమాలయ దేశంలోని పోఖ్రాకు చేరింది. ఆమె రాత్రి తన పిల్లలతో కలిసి హోటల్‌లో గడిపింది.

సచిన్ కోసం వచ్చిన సీమా

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లోని పోఖ్రా నుంచి ఖున్వా సరిహద్దు వరకు సీమా బస్సు ఎక్కి భారత్‌లోకి ప్రవేశించిందని యూపీ ఏటీఎస్ తెలిపింది. సీమా లక్నో, ఆగ్రా నగరాలకు వెళ్లి మే 13వతేదీన గౌతమబుద్ధ నగర్‌కు చేరుకుంది. గౌతమబుద్ధ నగర్‌ని రబుపురాలో సచిన్ ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. తన ప్రియుడు, పిల్లలతో కలిసి సీమా నివాసం ఉంటోంది. కాగా భారత సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు సీమా హైదర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు