Chile Forest Fire : చిలీలో కార్చిచ్చు.. 99కి చేరిన మృతుల సంఖ్య .. కొనసాగుతున్న సహాయక చర్యలు

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఆగడం లేదు.. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 99 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. c

Chile : అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఆగడం లేదు.. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 99 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు బోరిక్ గ్రాబియల్ ఎమర్జెన్సీ విధించారు. నివేదిక ప్రకారం.. దక్షిణ అమెరికా దేశంలో నమోదైన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో ఇది ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 1600 ఇళ్లు ధ్వంసమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 19 హెలికాప్టర్లు, 450కిపైగా అగ్నిమాపకాలతో సిబ్బంది రంగంలోకిదిగి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Also Read : మరణం అంటూ తప్పుడు వార్తనే ప్రచార అస్త్రంగా వాడుకున్న నటి.. దేశవ్యాప్తంగా అవగాహనకు బీజం

తీర ప్రాంత పర్యాటక పట్టణం వినాడెల్ మార్, దారి చుట్టుప్రక్కల ప్రాంతాలు ప్రభావితమైనట్లు చిలీ అధికారులు తెలిపారు. మంటల ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు రెస్క్యూ టీంలు నానా తంటాలు పడుతున్నాయి. రెస్క్యూ సిబ్బందికి సహకరించాలని బోరిక్ చిలీ ప్రజలను కోరారు. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డాడు. మంటలను అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంటలు తీవ్రత అధికంగాఉన్న పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదిలాఉంటే.. వేసవి నెలల్లో చిలీలో అడవి మటలు చెలరేగడం సాధారణమే.

 

ట్రెండింగ్ వార్తలు