Cycle Wali Chai
Cycle Wali Chai: ‘నేను బాగా చదువుకోవాలని అనుకున్నాను.. కానీ, మా కుటుంబ పరిస్థితులు అనుకూలించక నా చదువును త్యాగం చేశాను. ఉద్యోగంలో చేరాను’ అని కొందరు సాకులు చెబుతుంటారు. కోచింగ్ కు, తిండికి డబ్బు లేకపోవడంతో చదువు ఆపేశానని చెప్పుకు తిరుగుతుంటారు. అయితే, నిజంగా చదువుకోవాలని అనుకుంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని కొందరు నిరూపిస్తుంటారు.
‘ఎక్కడ సంకల్పం ఉంటుందో.. అక్కడ మార్గం కనపడుతుంది’ అని చాటిచెబుతుంటారు. కుటుంబం కోసం ఓ పక్క ఉద్యోగం లేదా చిరు వ్యాపారాలు చేస్తూనే, మరోపక్క చదువునూ కొనసాగిస్తుంటారు. అటువంటివాడే ఈ యువకుడు. రాత్రిపూట తన సైకిల్ పై ఛాయి తీసుకెళ్లి అమ్ముతూ, ఉదయం పూట చదువుకుంటున్నాడు.
అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన అజయ్ అనే యువకుడు టీ అమ్ముతూ తన కోచింగ్ కు, ఆహారానికి, బతకడానికి డబ్బు సంపాదిస్తూనే, చదువునూ కొనసాగిస్తున్నాడు. సైకిల్ పై ఛాయి పేరిట అతడి వీడియోను ఓ జర్నలిస్టు పోస్ట్ చేశాడు.
గిరిజన యువకుడు అజయ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటూ, రాత్రిపూట ఇలా సైకిల్ పై ఛాయి తీసుకెళ్లి అమ్ముతుంటాడని చెప్పాడు. అతడు పడ్డ కష్టాలకు సంబంధించిన ఈ వీడియో, అతడు భవిష్యత్తులో గొప్పవాడు అయ్యాక ఓ రుజువుగా నిలుస్తుందని అన్నాడు.
इंदौर..
हमारे आदिवासी भाई अजय से मिलोगे..!अजय दिन में पढ़ाई करता है और रात को चाय बेचता है ताकि कोचिंग,रहने,खाने का खर्चा निकल से..!
सच में अजय भगवान करे कभी बड़ा आदमी बन गया तो चाय बेचने वाला ये वीडियो अजय के संघर्ष का जीता जागता सबूत साबित होगा. pic.twitter.com/N2LnR6mo2T— Govind Gurjar (@Gurjarrrrr) December 23, 2022
Nepal PM Prachanda: మూడోసారి నేపాల్ పీఎంగా ప్రచండ .. సోమవారం ప్రమాణ స్వీకారం..